**********************మానవ జాతికి ******************
మానవ జాతికి మారిన రోజులు
ప్రాణముఁ దీయుచు భయమిడి రోజులు
కానని కరోనఁ గాల్చిన రోజులు
మా నవ జాతికి మభ్యపు రోజులు (1)
పరిణతిఁ జెందిన ప్రాణివి గదరా
పరులను జయించు బలుపువి గదరా
కరుణను మరచిన కామివి గదరా
దొరకని జబ్బుకి దొరికెను గదరా (2)
ఉరుకులు పరుగులు ను త్తివి కాదా
మరిచిన బంధము మండునుఁ గాదా
విరుగుడు విద్యలు వింతలుఁ గాదా
అరయఁగ మార్పును కోరెను గాదా (3)
ఆశలు భాషలు అడియాసౌనా
వేషము మార్చుట వీలగునౌనా
రోషము వీడిన రోదసియౌనా
దోషము లేనటి దొరలాగౌనా (4)
****************************************
మధురగతి రగడ పద్య లక్షణములు
- జాతి(రగడలు) రకానికి చెందినది
- 8 నుండి 16 అక్షరములు ఉండును.
- 4 పాదములు ఉండును.
- ప్రాస నియమం కలదు
- అంత్య ప్రాస నియమం కలదు
- ప్రాస యతి నియమం కలదు
- ప్రతి పాదమునందు 3 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
- ప్రతి పాదమునందు నాలుగు 4 మాత్రలు గణములుండును.
No comments:
Post a Comment