చదువులు కావవి, పరుగెడు!
పదవులు కావవి, మనసుని పలుకగ లేకన్
చెదిరిన బ్రతుకుల కుంపటి!
కుదురగు మార్గము తెలియును, కొలవగ భక్తిన్! (1)
పలికిన మాటలు వేఱఁగు
కలిగిన చేతలు నిరతము గమ్యము లేకన్
చిలికిన ధనములు వెతలగు
విలువగు జీవమును ముక్తి వెలుగును భక్తిన్! (2)
మంగమ్మను మోయు సుకృత
మింగ దొరికెను మదిలోన మెచ్చగ నేడున్
హంగులతో నోర్లాండన్
రంగుల శోభలను మురిసె ప్రాయము భక్తిన్! (3)
ఎంతటి భాగ్యము, శ్రీహరి
ఇంతటి కళ్యాణమందు నిక్కడ జేర్చెన్
వింతగ లోకము జూసిన
అంతరమందున ప్రశాంతమందెను భక్తిన్! (4)
No comments:
Post a Comment