*****ఈ వారం నా మాట.*******
ఇంటిపని ఎక్కువ అనుకుంటున్నారా .. ?
పిల్లలు చదువుచున్నవాటిలలో భాషను నేర్చుకోవడం అనేది చాల కష్టం అయినది. ఎందుకు అంటే ఎంత పుస్తకములో చదివిన వాడుక లేనంతసేపు మరవటము సహజము. అందువల్ల మనము కొంచెం సమయము, వారములో కుదిరినప్పుడు వాళ్లతో సరదాగా చేయించాలి. అందరు పిల్లలు ఒకే విధముగా ఉండరుగనుక కొంచెం సంయమనము పాటించాలి. ఇక్కడ అమెరికాలో చాలా ఇతర తరగతులలో ఉంటారు కనుక మనము సమయాన్ని ఎటుల ఉపయోగించాలి అనేదే పెద్ద ప్రశ్న. అందులో భాగంగా ఎప్పుడయినా ఆడియో చేసి ఉంచుకుంటే ఉపయోగపడతాయి. నాకు కుదిరినప్పుడు చేసి పంపిస్తున్నాను కనుక అవి మీరు వాడుకోవచ్చు. ఇంకా ఏమైనా కొన్ని విషయాలలో మీకు సహాయము కావాలి అంటే నేను ఒక ఫోన్ కాల్ దూరములో ఉంటాను అని మాట ఇస్తున్నాను. మీరు తరగతి గురువులను సంప్రదించవచ్చు కూడా.
మనబడి వారు విశ్వవిద్యాలయమునకు అనుగుణంగా చాలా వివరముగా ప్రతీ రోజుకు 5 నిమిషాల నుండి 10 నిముషాలు సరిపడగా ఇంటిపనిని తయారు చేసి , మరల మరొకరిచే సరిచేయించి మరీ మనకు పంపిస్తున్నారు . మనము కుదిరినంత వాడుకున్నచో ఎంతో ఉపయోగపడుతుంది అని నా అభిప్రాయము.
అప్పుడప్పుడు కుదరనిచో ఒక వారము ముందో వెనకో చూసుకొని సమయము కుదురినప్పుడు ప్రయత్నించాలి. అదేవిధముగా తరగతిలో గురువులు కూడా ఎంతో ఓర్పుతో నేర్పుటకు ప్రయత్నిస్తున్నారు. మనకు ఉన్న వాటిలో 100% ప్రయత్నించి 60-80% చేసిన చాలు. ప్రయత్నసాధన లేకుండా ఏది సాధ్యముకాదు. అందరికీ తెలిసినది చెప్పుచున్నాను అని కాకుండా, ఇది మన పిల్లలకు, మనకు, తరువాత తరములకు శ్రేయస్కరమని అనుకుని కలిసి ముందుకు వెళదాము.
-మల్లేశ్వరరావు పొలిమేర 😊
************************
No comments:
Post a Comment