సర్కారు బళ్ళు
- చదువుల గుళ్ళు
క.వి. చదువుల గుళ్లయి, సంస్కరణమ్ములు సాధన చేసిన
శాలలు నా
పదలను
చెర్చుచు బాధ్యత నేర్పెడు వారధులౌ, మన బళ్లు గదా!
వదలక
పేదల పాలిట పెన్నిధివంటివనిన్,
సమభావమునన్
హృదయము
నెంచుచు శృంగము లెన్నడు వృద్ధిని
బెంచిన హృద్యమగున్! (1)
******************************
కవిరాజవిరాజితము
(హంసగతి , మహాతరుణీదయిత , శ్రవణాభరణమ్):
23 అక్షరములు
ఉండును.
30 మాత్రలు
ఉండును.
మాత్రా
శ్రేణి: I I I - I U I - I U I - I U I - I U I - I U I - I U I - I U
4 పాదములు
ఉండును.
ప్రాస
నియమం కలదు
ప్రతి
పాదమునందు 8,14,20 వ అక్షరములు యతి స్థానములు
ప్రతి
పాదమునందు న , జ , జ , జ , జ , జ , జ , వ(లగ) గణములుండును.
*************************************
సీ. తాతదండ్రులకు విద్యను నేర్పిన బడులు
తరతరాల
చరిత్ర దాగు గుడులు
నిరుపేద
ప్రజలకు కరువు పారద్రోలు
వెచ్చించుటలు
లేక వేలు వేలు
వయసుకు
తగినంత పాఠ్యప్రణాళిక
లను
గల్గి యిచ్చు నుల్లాస హేలి
చదువులతో
పాటు సంస్కారములు నేర్పి
ధీమంతులుగ
మార్చి తీర్చు కలలు
తే.గీ. అట్టి సర్కారు బడులన్ని యావిరౌచు
డబ్బు
నాశించి చదువుల డాబు చూపి
విద్య
నేర్పుట, నేర్చుట బేరమవుచు
చిన్నవారి
నొత్తిడి పెంచు చేష్టలేల? (2)
తే.గీ. మాతృభాషలో చదువులు మానకుండ
అన్యభాషలు నేర్పుచు నాణ్యతమున
ప్రగతి పథములో పయనించు బడుల కొరకు
పాఠకులు ప్రయత్నించిన
భాగ్యమగును. (3)
చ. గురువయి నీవు నేర్పు బడి కూడదటంచుచు గన్నవారికిన్
పరులకు
జెప్పు బోధనలపై తగు నమ్మక ముంచకుండుచున్
చెఱచగ
సామరస్యము, నశించెను నేడు ప్రభుత్వ శాఖలున్
మరువకు
మార్గదర్శివను మాటను! మార్పుకు నీవె మూలమౌ! (4)
కం. విద్యాదానము కొరకై
ఉద్యమములు
జేయుచున్న నున్నతపు బడుల్
చోద్యముగ చూడకు ప్రభూ
బాధ్యత
గని శుద్ధిచేయు బాలలకు గుడుల్! (5)
… మల్లేశ్వరరావు పొలిమేర
Trophy Club, Texas, USA. Ph: +1
9253894335