GITAM రోజులు

మా ఇంజినీరింగ్ GITAM రోజులు ...
****************************************************
సీ. ఏ చోట గువ్వలో ఎగిరెగురుతు వాలె
విద్యుత్తు శాఖలో విద్య కొరకు
"గీతమ్"ను గలిసి సంగీత స్వరాలౌచు
మిత్రులుగా ఆడి మైత్రి పెంచె
సాగర తీరము, సంధ్యా సమయములు
గడిపిన స్మృతులెప్డు కనులకింపు
చిలిపి చేష్టలె నాడు, చిత్రములుగ నేడు
చెలిమి పెంచేటివౌ స్నేహితులకు

తే.గీ. జూనియర్లకై స్వాగత శోభలన్ని
అరకులోయలకు విహార యాత్రకెల్లి
పంచుకుంటిమిటు విశాఖపట్నమందు
మూడు వత్సరముల నెమ్మి ముచ్చటాయె!
****************************************************

Comments

Popular posts from this blog

గౌరి పద్యము

భర్తృహరి నీతిశతకం – కేయూరాణి న భూషయన్తి

8వ ఉత్తర అమెరికా తెలుగు సంబరాలు - ఆంధ్ర (ప్రవాస) పౌరులై!