తొలకరి చినుకులు పడక
ఉ. పల్లెలు బంటభూములను బల్కుట మానుచు జిన్నబుచ్చుచున్
ఎల్లలు దాటి, పట్టణము లెక్కువ ముంచుతు విఱ్ఱవీగుతున్
ఎల్లరుకున్ విషాదముల నిచ్చుచు ముంచెను శోకసంద్రమున్
కల్లలు మానవయ్య, మము గాచగ రా! వరుణా! పరంజయా ! (1)
ఇంద్రవజ్రము…
మేఘమ్ము రాకుండెను మేదినందున్
తాగేటి నీరెక్కడ తాకకుండెన్
మా గాథ మా బాధలు మార్చలేకన్
త్యాగాల జీవమ్ములు ధారపోసెన్ (2)
******************************
ఇంద్రవజ్రము: వృత్తం రకానికి చెందినది
11 అక్షరములు ఉండును.
18 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U U I - U U I - I U I - U U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 8 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు త , త , జ , గా(గగ) గణములుండును.
*************************************
సీ. పైరు విత్తు నపుడు వర్షమ్ము రాకుండ
నీరుకై రోదించు నిత్యమతను
నారు నాలస్యమై నాభీలములు హెచ్చి
యధిగమించక వాలి యలసిసొలసె
పంట చేతికి రాగ వర్షించె పగబట్టి
కష్టమ్ము వ్యర్ధమై కలతపడెను
ఋతుపవనమ్ములు కృతకర్మ తోడుత
కలిసి రాకున్నచో కలిమి చెడును
తే.గీ. పర్యవేక్షించి ప్రకృతిని పదిల పరుచు
వరుణ దేవుడు దీవించి వరము లిచ్చు,
రైతు బ్రతికిన బ్రతికించు రాజ్యములను
అన్నదాత శ్రమకు తగ్గ యాప్తి కలుగు. (3)
తొలకరి చినుకులు పడిన
కం. పల్లెప్రజలను తట్టుచు
తుళ్లించగ మమతలన్ని తొలకరి చినుకుల్,
జల్లుల సవ్వడితో నూ
ర్లల్లో సస్యముల చుట్టు రైతుల తలపుల్ ! (4)
కం. వర్షపు చినుకులు పడి పడి
హర్షము పెంచుచు తడి తడి హాయిని గొలిపెన్,
కర్షకలోకము మడి మడి
వర్షపు నీటిన్ విడి విడి పరవశ మాయన్! . (5)
… మల్లేశ్వరరావు పొలిమేర

No comments:
Post a Comment