Monday, February 26, 2018

ప్రజ - పద్య ప్రబంధ అంగీకారము

**************************************************
కం. గురువులు, మిత్రులుఁ జూడఁగ 
మరువఁక మనసాగఁక కలమందున కదలా 
డరదు శుభఘడియ లనుచును,
దరిచేరెదననిఁ దెలుపెద ధన్యత్వమునన్ !
**************************************************

Sunday, February 25, 2018

మనబడి - USA - కెల్లరు - పిల్లల పండుగ

మనబడి - USA - కెల్లరు - పిల్లల పండుగ 
తరగతులు - బాలబడి, ప్రవేశము, ప్రసూనము, ప్రకాశము, ప్రమోదము 
*************************************
సీ. "బాలబడిఁ" జదువు పలుకుల చిలకలుఁ
దెలుగున వెలుగులుఁ దెచ్చి చూపి 
బద్దెన పద్యపు సుద్దులతోఁ "బ్రవే
శము" నెఱిఁగిన బాల, చాటి నేడు
వేమన శతకపు సామాజికతఁ "బ్రసూ
నము" నందు, లఘునాటకమున నాడి
నవ్వులఁ బువ్వుల నాటికను "బ్రకాశ
ము" నెదిగెనని బాల ముచ్చటించె

తే.గీ. తెలుగు యాసఁ "బ్రమోదపు" దివ్వెటీలు
కెల్లరు మనబడిఁ దెలుగుఁ గీర్తిఁ బెంచి 
తల్లిదండ్రులు గాక్షించఁ దన్మయమున
వెల్గు చుండుఁ దెలుగు ఖ్యాతి విశ్వమందు 
*************************************


Friday, February 23, 2018

HAIKU POEMS

                                                                                                                                         02/23/2018
Author: Malleswara Rao Polimera
Author: Dhruv Polimera
1.      The rain is falling,
I want to sleep more time though,
Are you feeling so!

Vegetables
A.     Eat Vegetables,
Eat them day and night ‘Kay,
They are nutritious!

2.      The rain is falling,
My mind is so refreshing,
What a nice time is!

         Fruits
B.     Yummy Yummy fruits,
Eat them all the time Okay,
Grow so big and tall!

3.      The rain is falling,
The water is flowing down,
My thoughts are also!

Sugar
C.      Unhealthy Sugar,
They give you big cavities,
Brush Brush so they die!

4.      The rain is falling,
Clouds are covering trophy club,
Cooling day ahead!
Water Cycle
D.     Evaporation,
Go into the clouds and back,
Helping the cycle!

5.      Learning haiku now,
Gives us more fun-filled joy,
Dhruv and I enjoyed!

Parents
E.      Parents helping us,
Parents taking so much care,
They love us so much!

6.      I love my kiddos,
More than me and forever,
They are my heart-beat!

Nature Walk
F.      Guess where I’m going,
If you said nature walk right,
Buzz I hear the bees!




పూర్వి చెవులు కుట్టించు దినము

పూర్వి చెవులు కుట్టించు దినము
***************ఆటవెలది*********************
తల్లిదండ్రులుగను దల్లడిల్లితిమిగ
రెండు దినము లందు ప్రేమతోడ
చిట్టి తల్లి పూర్వి చెవులు కుట్టుటకును, 
నెట్టి కష్ట మదని నెంచి చూసి! (1)
సుదిన మిదని దలచి కదులుచు సౌత్లేకు
నమ్మ ముద్దులిడగ నన్న తోడ
కపటమెరగక దను దపనతో పరుగెత్తు
నింటి శోభ బెంచు గంటి పాప (2)
చిన్న ముత్య మొదుగు చెవిపోగులను జూసి
నచ్చినవని పూర్వి మెచ్చగాను
కలతపఱచు చున్న, క్షణములో నతికించ
కెవ్వుమనిన వెంట నవ్వు లిచ్చె (3)
****************************************************

Thursday, February 15, 2018

Florida High School

My deep Condolences to the families, who lost their loved ones in the
Florida High School yesterday.
పురవాసి = మనిషి , పుడమి = దేశము , అరయించు = రక్షించు
***********************శివశంకర (సురభి)****************************
వినకూడని జెడువార్తను వినుచుండెను గదరా
కని బెంచిన దన బిల్లలు గనిపించరు ననగా
జనిపోవుట జవిచూచెను జదివించెడు గుడిలో
ననుయుద్ధము కెదురొచ్చెను నరచేతిని వధరా! (1)
నరలోకము నెదురించును నలుదిక్కుల జెడురా
దరిజేరగ విధిమార్చును దగుచర్యలు నిడుమా
కరుణామయి దయతోడను కరుణించుము నిలలో
వరమౌనది పరులందున పరమాత్మను గనినా (2)
ఎరుపున్నను దనబండ్లను నిలబెట్టిన పుడమిన్
అరుపెట్టిన దనరోగిని నరయించిన పుడమిన్
పురవాసికి విలువిచ్చుచు పురికొల్పిన పుడమిన్
సరదా కనుచు దుపాకికి జనువిచ్చుట దగునా? (3)
**************************************************************
శివశంకర (సురభి)
వృత్తం రకానికి చెందినది
ధృతి ఛందమునకు చెందిన 126844 వ వృత్తము.
18 అక్షరములు ఉండును.
22 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: I I U - I I I - I U I - I I I - U I I - I I U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 11 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు స , న , జ , న , భ , స గణములుండును.

Tuesday, February 13, 2018

శివరాత్రి శుభాకాంక్షలు

శివరాత్రి శుభాకాంక్షలు
**************************శివశంకర (సురభి)***************
శివశంకర శివశంకర శివశంకర మనుచూ
శివరాత్రిని మనసంతయు శివనామము నిడుమా
శివశక్తికి నిజరూపము చిగురించును మనసున్
అవరోధము లను మాటలు నగుపించవు కనుమా (1)

జపమాలగ శివనామము జనియించెడు విధమున్
ఉపవాసము దగురీతిని నుపయుక్తము కలుగున్
తపమందున నిలబెట్టెను దగుబక్తికి నెపుడున్
అపరాధము నణువైనను నగుపించదు వినుమా (2)
**************************************************************
శివశంకర (సురభి)
వృత్తం రకానికి చెందినది
ధృతి ఛందమునకు చెందిన 126844 వ వృత్తము.
18 అక్షరములు ఉండును.
22 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: I I U - I I I - I U I - I I I - U I I - I I U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 11 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు స , న , జ , న , భ , స గణములుండును.

Monday, February 12, 2018

గౌరి పద్యము

హృదయము నిలుచు స - హృదయ మాతా
మమతను దెలుపు స - మతగ మాతా
కలమును గదుపు స - కలము మాతా
ఫలముగ నిడుము స - ఫలము మాతా !
అయ్యో గౌరీమాతను "గౌరి"లో కొలుచుదామని అనుకొని...ప్రాస... తప్పు తప్పు ...
*****************గౌరి **********************
శివునికి సగమవు - చెలివి గౌరీ
దివిని సురలయెడ - దిశవు గౌరీ
అవనికి ప్రియమగు - నమవు గౌరీ
కవనము నొసగెద - కరుణ గౌరీ! (1)
పలికెద పదమున - ప్రతి దినమ్మున్
తలఁచెద తరగని - దగు తపమ్మున్
మలిచెద మనసును - మరి గతమ్మున్
కొలిచెద మమతల - గుడిని, గౌరీ! (2)
***************************************
అమ  = అమ్మ 

గౌరి పద్య లక్షణములు
అతిజగతి ఛందమునకు చెందిన 2048 వ వృత్తము.
13 అక్షరములు ఉండును.
15 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: I I I - I I I - I I I - I I U - U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు న , న , న , స , గ గణములుండును.

గౌరీ

హృదయము నిలుచు స - హృదయ మాతా
మమతను దెలుపు స - మతగ మాతా
కలమును గదుపు స - కలము మాతా
ఫలముగ నిడుము స - ఫలము మాతా !
అయ్యో గౌరీమాతను "గౌరి"లో కొలుచుదామని అనుకొని...ప్రాస... తప్పు తప్పు ...
*****************గౌరి **********************
శివునికి సగమవు - చెలివి గౌరీ
దివిని సురలయెడ - దిశవు గౌరీ
అవనికి ప్రియమగు - నమవు గౌరీ
కవనము నొసగెద - కరుణ గౌరీ! (1)
పలికెద పదమున - ప్రతి దినమ్మున్
తలఁచెద తరగని - దగు తపమ్మున్
మలిచెద మనసును - మరి గతమ్మున్
కొలిచెద మమతల - గుడిని, గౌరీ! (2)
***************************************
గౌరి పద్య లక్షణములు
అతిజగతి ఛందమునకు చెందిన 2048 వ వృత్తము.
13 అక్షరములు ఉండును.
15 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: I I I - I I I - I I I - I I U - U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు న , న , న , స , గ గణములుండును.

Sunday, February 11, 2018

తెల్గువెల్గులు

*********మత్తకోకిల********************
తెల్గువెల్గులు నేర్చినంతన దెంచుకోవుట సాధ్యమా
కల్గు సంతస మెంతయోయది కన్నదల్లిని జూపెగా
వెల్గులన్నియి బద్యమందున వెల్లువెత్తెను సోదరా
ముల్గుచున్నను జూపుచుండెను ముద్దులొల్కెడి భాషరా!
***********************************


Saturday, February 10, 2018

మకుటము

పద్యాలలో వేరొక కవుల మకుటము వాడుకొనుట ఎంత వరకు సమంజసము? ప్రతీ కవి యొక్క కవనము, అవి తన మానసమును ప్రతిబింబించునని నా అభిప్రాయము. ఆ కవిత్వములలో తన రూపమును ఆవిష్కరించవచ్చు. మరి తదుపరి తరములకు ఆ మకటము వేరే వారు వాడుటవల్ల ఆ పద్య కర్త తెలియక ఆ భావన మారునుకదా? కాదంటారా? వేమన గారివి కూడా చాలా వరకు వేరే పద్యములు కలిసినవి అని వింటిని.
**********************************
కం. మకుటము నుంచుచు మనసును
బ్రకటింతురు గవులెపుడును బాండిత్యమునన్
వికటించును విశ్వమది, మ
మకారము దెలిపిన బద్యమందు నది పరుల్!
**********************************

Wednesday, February 7, 2018

దత్తపది - 134 ఏరు - పారు - ఊరు - మారు ::కంది శంకరయ్య

మా నాన్నగారు అందరూ సరైన పంటకై ఒక సంవత్సరము పైనే వేచి చూస్తున్నారు. ఈ రోజు పరిస్థితి ...
ఈ నాటి సౌదర్యము ...
****************************************
ఏరువాకచేసి నెండిన బంటతో
పారు నీరు లేక బోరు మనుచు
ఊరురైతులంత కోరుచుందురు నేడు
మారు రోజు కొరకు, తీరు నయ్య? 
****************************************

Tuesday, February 6, 2018

బాల్యస్నేహితుల తలపు...

చిన్ననాటి మనది శ్రేష్ఠమైన చెలిమి
కలిసినాము నిపుడు కాలమందు
ఒకరి జాడ దెలిసి ఓయి నీవుయనుచు
మురిసినాము మరల ముదము తోడ

నమ్మకమ్ము పెంచి నలుగురితోడను
మంచి తెలిపి నడుచు మాట యందు
నీది నాది కాదు మాది యనినెపుడు
మాట మారిన నది చేటు గాదు

పేరు నూరు గాదు పేర్మితో పెరిగిన
దూరమున్నగాని వేరు గాము
చేరువైన మనసు నారు నీరును పోసి 
పెంచు బంధువులను నెంచకుండ