Monday, February 12, 2018

గౌరీ

హృదయము నిలుచు స - హృదయ మాతా
మమతను దెలుపు స - మతగ మాతా
కలమును గదుపు స - కలము మాతా
ఫలముగ నిడుము స - ఫలము మాతా !
అయ్యో గౌరీమాతను "గౌరి"లో కొలుచుదామని అనుకొని...ప్రాస... తప్పు తప్పు ...
*****************గౌరి **********************
శివునికి సగమవు - చెలివి గౌరీ
దివిని సురలయెడ - దిశవు గౌరీ
అవనికి ప్రియమగు - నమవు గౌరీ
కవనము నొసగెద - కరుణ గౌరీ! (1)
పలికెద పదమున - ప్రతి దినమ్మున్
తలఁచెద తరగని - దగు తపమ్మున్
మలిచెద మనసును - మరి గతమ్మున్
కొలిచెద మమతల - గుడిని, గౌరీ! (2)
***************************************
గౌరి పద్య లక్షణములు
అతిజగతి ఛందమునకు చెందిన 2048 వ వృత్తము.
13 అక్షరములు ఉండును.
15 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: I I I - I I I - I I I - I I U - U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు న , న , న , స , గ గణములుండును.

No comments:

Post a Comment