Wednesday, June 27, 2018

పుడమినిఁ బుట్టినఁ

ద్విపద(మాలిక)
*****************************
పుడమినిఁ బుట్టినఁ బుణ్యము కాద
ముడిపడు జీవనముల్ మన వవవ
మనిషికిఁ దోడగు మనుషుల లోటు
మనలో మనకెపుడు మాటల లోటు
మతములుఁ గులముల మాటున బలిగ
సతమతములతోడ సద్గతి కలగ
చదువుల నమ్ముచు సాధించెననుచు
పదవులు నందకఁ బ్రాయముల్ వదిలె
అత్యాశలకుపోయి యారటపడెను
నిత్యము దోపిడి నిశ్చయమయెను
నీదని నాదని నేలను దోచె
"నీదది పొమ్మని" నిక్కముఁ జేయు
చెట్టుకుఁ జేమకు జీవుల యందు
తట్టనిఁ దలపులు దండుగఁ దలచి
సాంకేతికతలను సంధించితిరని
అంకితభావము నందరు మరిచె
*****************************

Thursday, June 21, 2018

International Yoga Day

**********మధురగతి రగడ*********
యోగనుఁ బక్రియ యోషధి శాస్త్రము
భోగములును సరిపోవని శస్త్రము
రోగముపాలిటి లోకపు నస్త్రము
వేగిరపడుఁ గనువిప్పుగు వస్త్రము!

భారత దేశపు పాత వికాసము
చేరువ నున్ననుఁ జేరని పాసము 
కోరినఁ జాలును కూర్చుఁ బ్రకాశము
శారీర మనఃశాంతికి నొక సము!
*************************** 
యోషధి = మందుచెట్టు, పాసము  = క్షీరాన్నము, సము = దారి

మధురగతి రగడ
జాతి(రగడలు) రకానికి చెందినది
ప్రాస నియమం కలదు
అంత్య ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 3 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు నాలుగు 4 మాత్రలు గణములుండును.

"క్ష

*************************************************
కం. శిక్షణతో నక్షరములు 

మోక్షమవుచు వీక్షకులకు మోక్షము నిచ్చున్
దక్షతను విలక్షణముగ
ఈ "క్ష" ల పద్యపు సమీక్ష , యీ క్షణమయ్యెన్ !
*************************************************
మోక్షము(1) = అమృతము, క్షణము = పండుగ

Monday, June 18, 2018

నాన్నకు ప్రేమతో

నాన్నకు ప్రేమతో ... HAPPY FATHERS DAY
*************************
ఏమనిఁ జెప్పెద నీతని గురించి 
ప్రేమనిఁ గప్పిన బేరునుఁ ద్యజించు
------ కనగా బిడ్డనిఁ గావడి మోయుచు 
------ తనలో మురిసెను దారిని వేయుచు
రోషములున్నను లోలుఁడుఁ దానని
వేషము లేయునుఁ బిల్లల తోడను
------ ఆశల బాటలుఁ నందని వేమని
------ కాసుల కోసముఁ గష్టముఁ జేకొను
తడబడు నప్పుడుఁ దట్టుచు లేపుచు
నడుగులు దిద్దుచుఁ నండనుఁ జూపుచు
------ బాధలనెన్నడు భారముఁ గాదని
------ శోధన లన్నియుఁ జూపెడతానని
వియోగములన్ని విధిగాఁ నెదిరెను
బయటకుఁ దెల్పని బంధము నాదని
------ గెలుపును నిచ్చుచుఁ గీర్తినిఁ బెంచెను
------ వలపులు తలపులు వద్దకుఁ జేర్చెను
కన్నులలోఁ నిడుఁ గల్మషపుఁ బలుకు
నాన్నను మాటయె మిన్నగు నతనికి
*********************************************

Thursday, June 14, 2018

పట్వర్ధన్ గారికి - భామినీ షట్పద

పట్వర్ధన్ గారికి , వారి కుటుంబ సభ్యులకి సానుభూతితో అమ్మకై ...
*****************భామినీ షట్పద************
అమ్మయె తలఁచి తనువునుఁ బంచి 
కమ్మనిఁ బ్రేమ కళ్ళనుఁ బంచి 
పమ్మినశక్తి యుక్తులుఁ బంచి - వదిలె పట్వర్ధన్!
నమ్మిన బిడ్డఁ నాశలుఁ బెంచి
నెమ్మిగ జీవతమ్మునుఁ బెంచి 
వమ్ముపఱచక స్థాయినిఁ బెంచి - వదిలె పట్వర్ధన్! 
*********************************************
భామినీ షట్పద
జాతి(షట్పదలు) రకానికి చెందినది
8 నుండి 23 అక్షరములు ఉండును.
6 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
మూడవ పాదమునందు 5 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
ఆరవ పాదమునందు 5 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
గణ లక్షణాలు :
ఒకటవ పాదమునందు 3 - 4 , 3 - 4 మాత్రలు 
రెండవ పాదమునందు 3 - 4 , 3 - 4 మాత్రలు 
మూడవ పాదమునందు 3 - 4 , 3 - 4, 3 - 4, 2 మాత్రలు 
నాలుగవ పాదమునందు 3 - 4 , 3 - 4 మాత్రలు
ఇదవ పాదమునందు 3 - 4 , 3 - 4 మాత్రలు
ఆరవ పాదమునందు 3 - 4 , 3 - 4, 3 - 4, 2 మాత్రలు

Tuesday, June 12, 2018

gouri

***************అంబురుహము************************************
అంబను మ్రొక్కినఁ జాలును మానసమందుఁ దెల్వని సౌఖ్యమౌ
సాంబుని మ్రొక్కిన నిల్చునుఁ బొందిన సౌఖ్యమెప్పుడుఁ జెంత, హే
రంబుని మ్రొక్కినఁ గార్యములందున శ్రద్ధతో విజయమ్మిడున్
అంబ కుటుంబము తోడుగనుండగఁ నందు శ్రేయముఁ నెప్పుడున్! (1)
భక్తినిఁ జూపెడు మార్గము లెన్నియొ పార్వతమ్మనుఁ దల్చుచున్
భక్తినిఁ జూపక నుండినఁ జాలనె "వంచనల్ వెలయించ కా
భక్తినిఁ బంచిన నచ్చిన రీతిని బ్రహ్మనామ మెఱుంగుటౌ,
భక్తికి మూలము యుక్తిగ శక్తిని బాధ్యపర్చుటఁ దెల్సుకో!" (2)
***************************************************************
శంభు = శివుడు, హేరంబుఁడు = విఘ్నేశ్వరుడు
అంబురుహము
వృత్తం రకానికి చెందినది
కృతి ఛందమునకు చెందిన 372151 వ వృత్తము.
20 అక్షరములు ఉండును.
28 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U I I - U I I - U I I - U I I - U I U - I I U - I U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 13 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు భ , భ , భ , భ , ర , స , వ(లగ) గణములుండును.

అంబురుహము - గౌరీ

Wednesday, June 6, 2018

గౌరి

మా ఇంటి ముందర ఉన్న గుడిలోని గౌరిదేవిని ఉద్దేశించి వ్రాయబడిన .
కవిరాజవిరాజితము...
*************************************************************************
కనులను ముందరఁ గాంచినఁ దల్లి, నగస్త్యునిఁ గూడిన గౌరిగ, నా
కనఁబడు ప్రేమలుఁ, గైకొను పుత్రులుఁ, గల్లకుఁ గట్టెను క్రాంతులతో,
గణనము నందునఁ గమ్మని బంధపు కర్మలు నేర్పిన గంధములన్
గణముగఁ బంచి సకర్మలుఁ జేయుచుఁ గారణ జన్మముఁ గాచెదమున్!
*************************************************************************
అగస్త్యుఁడు = శివుడు

ఈ పద్య ఛందస్సుకే హంసగతి , మహాతరుణీదయిత , శ్రవణాభరణమ్ అనే ఇతర నామములు కూడా కలవు.
వృత్తం రకానికి చెందినది
వికృతి ఛందమునకు చెందిన 3595120 వ వృత్తము.
23 అక్షరములు ఉండును.
30 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: I I I - I U I - I U I - I U I - I U I - I U I - I U I - I U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 8,14,20 వ అక్షరములు యతి స్థానములు
ప్రతి పాదమునందు న , జ , జ , జ , జ , జ , జ , వ(లగ) గణములుండును.

Sunday, June 3, 2018

గౌరి

**********************************************************************
ఆ.వె. ఎక్కడుంటి వయ్య? యెక్కడఁ బిలువవే?
కలము కదలదేమి? కలత లేమి?
భారతి యొడిలోన పవళింప కరువాయె
కవిత రాక, తలఁచు గౌరి నయ్య! (1)
కం. నీకుఁ దెలియరానిదనుచు
సాకులు చెప్పగలమా విశాలాక్ష్మమ్మా?
మాకిలనుఁ దోడు నీవై
చీకటి ఛాయలనుఁ దీయు శ్రీశక్తివిగా! (1)
ఆ.వె.కాలగర్భమందుఁ గదులు ముందునకెప్డు
మనసు మేలుఁ గోరి మంచి తలచి
ధర్మ రూపమందు దయతోడ నీ రూపు
దుష్టశక్తులందు ధూపమగును! (2)
కం. ముక్తికి మార్గము మాకిటు
భక్తిని సమకూర్చినావు భాగ్యము తోడన్
శక్తిని నమ్ముచు మేము స్వ
శక్తినిఁ బెంచుచుఁ గదులుచు సాగెద మమ్మా! (2)
**********************************************************************