Sunday, June 3, 2018

గౌరి

**********************************************************************
ఆ.వె. ఎక్కడుంటి వయ్య? యెక్కడఁ బిలువవే?
కలము కదలదేమి? కలత లేమి?
భారతి యొడిలోన పవళింప కరువాయె
కవిత రాక, తలఁచు గౌరి నయ్య! (1)
కం. నీకుఁ దెలియరానిదనుచు
సాకులు చెప్పగలమా విశాలాక్ష్మమ్మా?
మాకిలనుఁ దోడు నీవై
చీకటి ఛాయలనుఁ దీయు శ్రీశక్తివిగా! (1)
ఆ.వె.కాలగర్భమందుఁ గదులు ముందునకెప్డు
మనసు మేలుఁ గోరి మంచి తలచి
ధర్మ రూపమందు దయతోడ నీ రూపు
దుష్టశక్తులందు ధూపమగును! (2)
కం. ముక్తికి మార్గము మాకిటు
భక్తిని సమకూర్చినావు భాగ్యము తోడన్
శక్తిని నమ్ముచు మేము స్వ
శక్తినిఁ బెంచుచుఁ గదులుచు సాగెద మమ్మా! (2)
**********************************************************************

No comments:

Post a Comment