Monday, June 18, 2018

నాన్నకు ప్రేమతో

నాన్నకు ప్రేమతో ... HAPPY FATHERS DAY
*************************
ఏమనిఁ జెప్పెద నీతని గురించి 
ప్రేమనిఁ గప్పిన బేరునుఁ ద్యజించు
------ కనగా బిడ్డనిఁ గావడి మోయుచు 
------ తనలో మురిసెను దారిని వేయుచు
రోషములున్నను లోలుఁడుఁ దానని
వేషము లేయునుఁ బిల్లల తోడను
------ ఆశల బాటలుఁ నందని వేమని
------ కాసుల కోసముఁ గష్టముఁ జేకొను
తడబడు నప్పుడుఁ దట్టుచు లేపుచు
నడుగులు దిద్దుచుఁ నండనుఁ జూపుచు
------ బాధలనెన్నడు భారముఁ గాదని
------ శోధన లన్నియుఁ జూపెడతానని
వియోగములన్ని విధిగాఁ నెదిరెను
బయటకుఁ దెల్పని బంధము నాదని
------ గెలుపును నిచ్చుచుఁ గీర్తినిఁ బెంచెను
------ వలపులు తలపులు వద్దకుఁ జేర్చెను
కన్నులలోఁ నిడుఁ గల్మషపుఁ బలుకు
నాన్నను మాటయె మిన్నగు నతనికి
*********************************************

No comments:

Post a Comment