Wednesday, June 6, 2018

గౌరి

మా ఇంటి ముందర ఉన్న గుడిలోని గౌరిదేవిని ఉద్దేశించి వ్రాయబడిన .
కవిరాజవిరాజితము...
*************************************************************************
కనులను ముందరఁ గాంచినఁ దల్లి, నగస్త్యునిఁ గూడిన గౌరిగ, నా
కనఁబడు ప్రేమలుఁ, గైకొను పుత్రులుఁ, గల్లకుఁ గట్టెను క్రాంతులతో,
గణనము నందునఁ గమ్మని బంధపు కర్మలు నేర్పిన గంధములన్
గణముగఁ బంచి సకర్మలుఁ జేయుచుఁ గారణ జన్మముఁ గాచెదమున్!
*************************************************************************
అగస్త్యుఁడు = శివుడు

ఈ పద్య ఛందస్సుకే హంసగతి , మహాతరుణీదయిత , శ్రవణాభరణమ్ అనే ఇతర నామములు కూడా కలవు.
వృత్తం రకానికి చెందినది
వికృతి ఛందమునకు చెందిన 3595120 వ వృత్తము.
23 అక్షరములు ఉండును.
30 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: I I I - I U I - I U I - I U I - I U I - I U I - I U I - I U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 8,14,20 వ అక్షరములు యతి స్థానములు
ప్రతి పాదమునందు న , జ , జ , జ , జ , జ , జ , వ(లగ) గణములుండును.

No comments:

Post a Comment