మాదక ద్రవ్యాల
మత్తులో యువత - నాశనమవుతున్న భవిత
క.వి. విలువలు నేర్పక విద్యను నేర్పక విత్తము తోడను బెంచినచో
కలతలు
జూసిన కావ్యము పొందిన కర్మగ
దల్చిన కారణమున్
దళముగ
మత్తుపదార్ధములన్నియు త్రాగుచు
తూగెను దాసులుగా
మలచుచు
సక్రమ మార్గము జూపిన మంచిగ బిల్లలు మారెదరున్ (1)
విత్తము
= ధనము, కావ్యము = సుఖము, దళము = అధికము
కవిరాజవిరాజితము
(హంసగతి , మహాతరుణీదయిత , శ్రవణాభరణమ్):
23 అక్షరములు
ఉండును.
మాత్రా
శ్రేణి: I I I - I U I - I U I - I U I - I U I - I U I - I U I - I U
4 పాదములు
ఉండును.
ప్రాస
నియమం కలదు
ప్రతి
పాదమునందు 8,14,20 వ అక్షరములు యతి స్థానములు
ప్రతి
పాదమునందు న , జ , జ , జ , జ , జ , జ , వ(లగ) గణములుండును.
*************************************
కం. చెత్తయని తెలిసిన యువత
మత్తున కలవాటు పడుచు
మగ్గుచునుండెన్
మొత్తుకొనిన
బండి నడిపి
నెత్తురు కార్చుటలు
నేడు నిత్యము జూపెన్ (2)
సీ. విద్యార్థి దశలోన విచ్చలవిడి తన
మలవర్చు సంస్థలు మాటు వేయు
మాదకద్రవ్యమ్ము మా చక్క చుక్కని
మభ్యపెట్టుచు వారు మార్చదలచు
ధనలోభులౌచు హితమొనరించక నేడు
మానవత్వము గూడ మరచు నెపుడు
యువత భవితతో ప్రయోగముల్ చేయుచు
చీడపురుగులౌచు చెఱచు చుండు
తే.గీ. గారముగ తాము పెంచిన కన్నబిడ్డ
విద్యకై చమటోడ్చిరి విస్తృతమ్ము,
వ్యసనములకు బానిసముగ వ్యర్ధమయిన
తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లె! (3)
కం. కల్పిత జీవితమది యని
తెల్పక
నీ జీవితమును తేల్చెను మత్తున్
స్వల్పానందము కొరకున్
కల్పతెరువులా
కనపడి కాల్చును మనిషిన్! (4)
తే.గీ. మాదకద్రవ్యములలోన మగ్గ కుండ
బ్రతుకు బాటను ఛేదించు బాధ్యతగను
మత్తు వీడుచు చూడు గమ్మత్తు రోజు
కష్టసుఖములు జూపును కర్మ విలువ
(5)
… మల్లేశ్వరరావు పొలిమేర
Trophy Club, Texas, USA. Ph: +1
9253894335