Thursday, July 13, 2017

వివాహ వ్యవస్థ - సంతానము

నేటి సమాజంలో విచ్ఛిన్నమౌతున్న వివాహ వ్యవస్థ - సంతానముపై దాని ప్రభావము
త్రిభంగి:
పరిచయ మయినను మరువక కలియుచు నిరతము ప్రేమని వచ్చెన్ మనసిచ్చెన్ నిత్యము మెచ్చెన్
విరివిగ ధనమును, తిరుగుతు సమయము కఱచుచు రోజులు సాగున్ కలిసూగున్ ప్రేమగ తూగున్
పరిణయ మయినను చిరుచిరు గొడవలు పెరుగుచు వీడుట యేలన్ చిరు గోలన్ భారములేలన్
తరుగుచు పెరిమలు మరువగ నొరిమలు నెరుగక యేడ్చెను బాలల్ విధి లీలల్ చోద్యపు జ్వాలల్! (1)
******************************
త్రిభంగి:
వృత్తం రకానికి చెందినది, 4 పాదములు ఉండును.
పాదమునకు 26 అక్షరములకన్న ఎక్కువగా నుండే ఉద్ధురమాలా వృత్తముల తరగతికి జెందినది. ప్రతి పాదానికి 34 అక్షరములు.
గణములు-- న,న,న,న,న,న, స, స,భ,మ,స,గ. ప్రాస నియతము .
2,10,18 స్థానములలో ప్రాస యతులు.
పాదము ఉత్తరార్ధములో 3 అంత్యప్రాసలు.
******************************

కం. దంతు లిరువురు వడిగా 
సంపాదించినను గాదు సంసారమ్ముల్
ఇంపైన బంధములతో
పెంపొందించినను బొందు ప్రియముగ నేడున్!  (2)

సీ. లుమగలమన్న యాలోచనలు లేక
పిల్లలన్ కాంచక కళ్ల యదుట       
మాటకు మాటాడి రిచెను మర్యాద
పోట్లాటలన్ పెంచె పోటి పడుచు
దువులు పెరిగిన సంస్కారము తరిగి
ర్దుబాటులు లేక తికిలబడు
ధిక్యతకొరకు నాటలాడదలచి
అంతమొందిరి నేడు పంతమునను
ఆ.వె. సంయమమున జూడు సంశయములు తీరు
ప్రేమ పంచకున్న పెరుగుటేల?
లసి మెలసి యున్న లదు సుఖమనుచు
చెప్పుచున్నమాట యొప్పు కాద! (3)


క.వి. యము లేదని సాయము జేయక సాకులు జెప్పిన సాములతో
ముగ జీతము సాధ్యము మాకని మ్ముని జూపిన స్వామినులున్
వితులుగా తమ వేరము బెంచుచు వీడెను, నిప్పుడు విశ్వమునన్
తమ వాదన ప్పని కోర్టులు ర్మము జెప్పక ప్పుకొనెన్ 
తను నేర్పిన సంఘము లొచ్చిన  సంతతి బాగును సాగుదురున్ !   (4)

సామి= భర్త, స్వామిని =భార్య, సము = గర్వము, విమతి = బుద్ధిహీనుడు, వేరము = విరోధము
******************************
కవిరాజవిరాజితము (హంసగతి , మహాతరుణీదయిత , శ్రవణాభరణమ్):
23 అక్షరములు ఉండును.
30 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: I I I - I U I - I U I - I U I - I U I - I U I - I U I - I U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 8,14,20 వ అక్షరములు యతి స్థానములు
ప్రతి పాదమునందు న , జ , జ , జ , జ , జ , జ , వ(లగ) గణములుండును.
*************************************

ఆ.వె. మూడుముళ్ల పొత్తు ముచ్చటైనదనుచు
విద్య లేని నాడు విలువ నిచ్చె
మూడు ముళ్ళు విప్పి ముచ్చటైనదనుచు
విద్య నేర్చి నేడు విలువు మరచె (5)
… మల్లేశ్వరరావు పొలిమేర

   Trophy Club, Texas, USA. Ph: +1 9253894335 

No comments:

Post a Comment