Wednesday, July 5, 2017

వివాహాలు - విడాకులు

త్రిభంగి:
పరిచయ మయినను మరువక కలియుచు నిరతము ప్రేమని వచ్చెన్ మనసిచ్చెన్ నిత్యము మెచ్చెన్
విరివిగ ధనమును, తిరుగుతు సమయము కఱచుచు రోజులు సాగున్ కలిసూగున్ ప్రేమగ తూగున్
పరిణయ మయినను చిరుచిరు గొడవలు పెరుగుచు వీడుట యేలన్ చిరు గోలన్ భారములేలన్
తరుగుచు పెరిమలు మరువగ నొరిమలు నెరుగక యేడ్చెను బాలల్ విధి లీలల్ చోద్యపు జ్వాలల్! (1)

త్రిభంగి వివరములు/లక్షణములు :
పాదమునకు 26 అక్షరములకన్న ఎక్కువగా నుండే ఉద్ధురమాలా వృత్తముల తరగతికి జెందినది. ప్రతి పాదానికి 34 అక్షరములు.
గణములు-- న,న,న,న,న,న, స, స,భ,మ,స,గ. ప్రాస నియతము .
2,10,18 స్థానములలో ప్రాస యతులు.

పాదము ఉత్తరార్ధములో 3 అంత్యప్రాసలు.

No comments:

Post a Comment