Posts

Showing posts from October, 2025

రామకృష్ణ కవి పద్యం

  ఉ. లింగనిషిద్ధు కల్వల చెలింగని మేచక కంధరున్ త్రిశూ లింగని సంగతాళి లవలింగని నీలకచన్ విధాతృ నా లింగని కృష్ణచేలుని హలింగని కర్ధమదూషితన్ మృణా లింగని రామకృష్ణకవిలింగని కీర్తి హసించె దిక్కులన్! Meaning

దీపావళి శుభాకాంక్షలు

 దీపావళి పండుగలో మీ పిల్లలతో కలయుచు మీకేరింతల్ చూపరులకు కనువిందై మీ పల్లెలలో వెలయును మీతోనవ్వుల్ (1) టామ్ టామ్ టపాసు టపటప టామ్ టామ్ తప్పుకొ టుపుక్కు టక్కరి మామా  టామ్ టామ్ చూస్ చూస్ చూసుకొ  టామ్ టామ్  చూస్ చుంచుబుడ్లు టక్కున పేలే (2) 

Seetharamayya Gari Manavaralu - పూసింది పూసింది పున్నాగ

Artists:  S. P. Balasubrahmanyam ,  K. S. Chithra Movie:  Seetharamayya Gari Manavaralu Released:  1991 పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ సందేళ లాగేసె సల్లంగ దాని సన్నాయి జళ్ళోన సంపెంగ ముల్లోకాలె కుప్పెలై జడకుప్పెలై .. ఆడ జతులాడ .. పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ సందేళ లాగేసె సల్లంగ దాని సన్నాయి జళ్ళోన సంపెంగ ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా .. అష్టపదులే పలికె నీ నడకే వయ్యారంగా .. కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో .. కలలొచ్చాయిలే .. కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే ..   కధ చెప్పాయిలే .. అనుకోనిరాగమే .. అనురాగ గీతమై .. వలపన్న గానమే .. ఒక వాయులీనమై .. పాడె .. మదిపాడె .. పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ సందేళ లాగేసె సల్లంగ దాని సన్నాయి జళ్ళోన సంపెంగ పట్టుకుంది నాపదమే .. నీ పదమే పారాణిగ .. కట్టుకుంది నా కవితే .. నీ కళలే కళ్యాణిగ .. అరవిచ్చేటి ఆ భేరి రాగాలకి .. స్వరమిచ్చావులే .. ఇరు తీరాల గోదారి గంగమ్మకే .. అలలిచ్చావులే .. అల యెంకి పాటలే ఇల పూలతోటలై ....

పరువం వానగా - "రోజా" (1992)

  పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెలే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే   పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెలే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే   నదివే నీవైతే అల నేనే ఒక బాdhaణివైతే నీ రాగం నేనే   పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే …. నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే నీ పాల పొంగుల్లో తేలనీ నీ గుండెలో నిండనీ నీ నీడలా వెంట సాగనీ నీ కళ్ళల్లో కొలువుండనీ   పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెలే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే … నీ గారాల చూపులే నాలో రేపేను మోహం నీ మందార నవ్వులే నాకే వేసేను బంధం నీ లేత మధురాల ప్రేమలో నీ కలలు పండిం...

Kanne Pillavani - Aakali Rajyam

  Kanne Pillavani - Aakali Rajyam రచయిత - ఆత్రేయ చిత్రం - ఆకలి రాజ్యం     తన్న తన్ననాన తన్న తన్ననాన తన్ననాన తానా తన తన్నానా ఓహో కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ లల్ల లాలలల్ల లల్ల లాలలల్ల లల్ల లల్లా లాలాలా అహహా చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ ఏమంటావ్ హు హు హూ సంగీతం న న నా నువ్వయితే రి స రి సాహిత్యం మ్ హు హు నేనౌతా సంగీతం నువ్వయితే సాహిత్యం నేనౌతా కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ   న న న న న సే ఇట్ వన్సెగెన్ న న న న న hmm స్వరము నీవై తరనన తరరనన స్వరమున పదము నేనై, ఓకే తానే తానే తాన ఓహో అలాగా … .గానం గీతం కాగా తరన తన కవిని నేనై తానా ననన తాన నాలో కవిత నీవై నాననాననా లలలా తననా తాననా బ్యుటిఫుల్, కావ్యమైనదీ తలపో ప...

భర్తృహరి నీతిశతకం – కేయూరాణి న భూషయన్తి

శ్లోకం: केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वला                                    न स्रानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः I वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्तेखिल भूषणानि सततं वाग्भूषणं भूषणम् II                                            भर्तृहरि नीतिशतकम्  । శ్లోకం: కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః । వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయన్తేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ॥             భర్తృహరి నీతిశతకం – విద్వత్పద్ధతి పై శ్లోకములోని నాలుగవ పాదానికి పాఠాంతరం: క్షీయన్తే ఖలు భూషణాని, సతతం, వాగ్భూషణం భూషణం పద విభాగం: కేయూరాణి, న భూషయన్తి, పురుషం, హారాః, న, చన్ద్రోజ్జ్వలాః, న స్నానం, న విలేపనం, న కుసుమం, నాలఙ్కృతాః, మూర్ధజాః, వాణీ, ఏకా, సమలఙ్...