బేట్రాయి సామి దేవుడా - ఎడ్ల రామదాసు
బేట్రాయి సామి దేవుడా – నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా – నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా (2) కాటేమి రాయుడా – కదిరినరసిమ్ముడా మేటైన వేటుగాడ నిన్నే నమ్మితి రా సామి ||బేట్రాయి|| శాప కడుపు సేరి పుట్టగా – రాకాసి గాని వాని కోపామునేసి కొట్టగా ఓపినన్ని నీల్లలోన - వలసీ వేగామె తిరిగి ( వచ్చి నీవు వెదికి వెదికి ) బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ ||బేట్రాయి|| తాబేలై తాను పుట్టగా ఆ నీల్లకాడ దేవాసురులెల్లకూడగా (2) దోవసూసి కొండకింద దూరగానే సిల్కినపుడు సావులేని మందులెల్ల పావనంబైన వెన్న దేవర్లకిచ్చినోడ ||బేట్రాయి|| అందగాదనవుదులేవయా – గోపాల గో విందా రచ్చించా బేగరావయా పందిలోన సేరి కోర పంటితోనె ఎత్తి భూమి కిందు మిందు సేసినోద సందమామ నీవె కాద ||బేట్రాయి|| నారసిమ్మ నిన్నె నమ్మితి – నానాటికైన కోరితి నీ పాదమే గతీ ఓరి నీవు కంబాన సేరి ప్రహ్లాదు గాచి కోర మీసవైరిగాని గుండె దొర్లసేసినోడ ||బేట్రాయి|| బుడత బాపనయ్యవైతివి ఆ సక్కురవరితి నడిగి భూమి నేలుకుంటివే నిడువు కాల్లోడివై అడుగు నెత్తిపైన బెట్టి తడవు లేక లోకమెల్ల మెదిమతోటి తొక్కినోడ ||బేట్రాయి|| రెందుపదులు ఒక్కమారుతో ఆ దొరలనెల్ల సెండాడినావు పరస...