Posts

Showing posts from April, 2026

యుద్ధభూమిలో గెలుపు లేమిరా?

Image
  నాడు నేడని  వాడు వీడని  కీడునెంచెడు కాలమిదిరా యుద్ధభూమిలో గెలుపు లేమిరా? నెత్తురు తడిసిన నేలపై  నిజమైన విజేత లెవరురా?  మనిషి మనిషినే  చూడలేని  మానవత్వ హీనులై...  మనసు మనసునే మార్చలేని  మారణహోమ ఉత్ప్రేరకములై.. విశ్వశాంతియని పర్యావరణ కాలుష్యమని ప్రగల్భాల ప్రేలాపన లేలనో... దేశ విదేశ పాశవిక వ్యవస్థ ముసుగులో  మగ్గుతున్న  విగతజీవులెందరో… నాడు నేడని  వాడు వీడని  కీడునెంచెడు కాలమిదిరా యుద్ధభూమిలో గెలుపు లేమిరా? నెత్తురు తడిసిన నేలపై  నిజమైన విజేత లెవరురా?  ఆధిపత్యమని మత ప్రవర్తనలని కులపు కుమ్ములాటలని హద్దుమీరు జాత్యహంకారంలో... అలసి సొలసిన  అమాయకులెందరో … తిరిగిరాని దీన దయనీయ విగత జీవులెందరో… ఏదిరా మీ దేశము రాదురా మీ వెనుక నెప్పుడూ  ఏదిరా మీ వేషము   భాద్యతా రహిత మేలరా...  కూడ బెట్టుచు కూల గొట్టుచు వినాశన ఆయుధాల కూడగట్టుచు  ఏమిరా ఆ ఉన్నతి  ఏమిరా ఆ అభివృద్ధి  నాడు నేడని  వాడు వీడని  కీడునెంచెడు కాలమిదిరా యుద్ధభూమిలో గెలుపు లేమిరా? నెత్తురు తడిసిన నేలపై  నిజమైన విజేత ల...