Posts

Showing posts from 2026

యుద్ధభూమిలో గెలుపు లేమిరా?

Image
  నాడు నేడని  వాడు వీడని  కీడునెంచెడు కాలమిదిరా యుద్ధభూమిలో గెలుపు లేమిరా? నెత్తురు తడిసిన నేలపై  నిజమైన విజేత లెవరురా?  మనిషి మనిషినే  చూడలేని  మానవత్వ హీనులై...  మనసు మనసునే మార్చలేని  మారణహోమ ఉత్ప్రేరకములై.. విశ్వశాంతియని పర్యావరణ కాలుష్యమని ప్రగల్భాల ప్రేలాపన లేలనో... దేశ విదేశ పాశవిక వ్యవస్థ ముసుగులో  మగ్గుతున్న  విగతజీవులెందరో… నాడు నేడని  వాడు వీడని  కీడునెంచెడు కాలమిదిరా యుద్ధభూమిలో గెలుపు లేమిరా? నెత్తురు తడిసిన నేలపై  నిజమైన విజేత లెవరురా?  ఆధిపత్యమని మత ప్రవర్తనలని కులపు కుమ్ములాటలని హద్దుమీరు జాత్యహంకారంలో... అలసి సొలసిన  అమాయకులెందరో … తిరిగిరాని దీన దయనీయ విగత జీవులెందరో… ఏదిరా మీ దేశము రాదురా మీ వెనుక నెప్పుడూ  ఏదిరా మీ వేషము   భాద్యతా రహిత మేలరా...  కూడ బెట్టుచు కూల గొట్టుచు వినాశన ఆయుధాల కూడగట్టుచు  ఏమిరా ఆ ఉన్నతి  ఏమిరా ఆ అభివృద్ధి  నాడు నేడని  వాడు వీడని  కీడునెంచెడు కాలమిదిరా యుద్ధభూమిలో గెలుపు లేమిరా? నెత్తురు తడిసిన నేలపై  నిజమైన విజేత ల...

బాలలం మేము బాలలం

Image
 [Verse 1] బాలలం మేము బాలలం తెలుగు పలికి మురిపాలు చిలుకు గువ్వలం బాలలం మేము బాలలం [Chorus] బాలలం మేము బాలలం తెలుగు పలికి మురిపాలు చిలుకు గువ్వలం బాలలం మేము బాలలం [Verse 2] అమ్మతో మేము ఆడుతాం కమ్మనైన ప్రేమను పంచుతాం నాన్నతో మేము నడుస్తాం అన్ని పనులలో కలసి చెయ్యందిస్తాం [Added lines - Family & Love] గురువుల మాటలు వినే శిష్యులం జ్ఞానపు వెలుగులో వెలిగే దివ్వెలం  [Chorus] బాలలం మేము బాలలం తెలుగు పలికి మురిపాలు చిలుకు గువ్వలం బాలలం మేము బాలలం [Verse 3] వీరులం మేము వీరులం విశ్వశాంతికై ఎదిగే ధీరులం సూరులం మేము సూరులం సుగుణ స్వభావ నభ్యసించే విద్యార్థులం [Added lines - Inspiration & Enlightenment] పుస్తకం పట్టుచు ముందడుగు వేస్తాం భారత భవితను మేము తీర్చిదిద్దుతాం నవ భారతపు నిర్వాహుకులం  నేటి చిన్నారులం రేపటి పౌరులం [Chorus] బాలలం మేము బాలలం తెలుగు పలికి మురిపాలు చిలుకు గువ్వలం బాలలం మేము బాలలం [Bridge - spoken/rhythmic chant] చదువుతాం! ✦ ఎదుగుతాం ! ✦ ప్రేమిస్తాం! ✦ వెలిగిస్తాం ✦ [Final Chorus - big, full] బాలలం మేము బాలలం తెలుగు పలికి మురిపాలు చిలుకు గువ్వలం బాలలం మేము ...

One two three four

Image
[Style: kids dance pop, cartoon energy, BPM 120, children choir, call-and-response, clap on every beat, bright xylophone, punchy kick drum]  [Intro - drum roll + spoken shout]  ONE! TWO! THREE! FOUR!  [Chorus]  One two three four, dance with me more!  One two three four, dance with me more!  [Verse 1 - playful, bouncy]  What do you care when you jump some more?  Buddy can you dare, dance with me more!  Peppa Pig is muddy jumping, come on jump!  Bluey says let's play, don't stop let's go romp! [ Chorus] [Verse 2 - action shouts]  Jump left! Jump right! Hang with me tight!  Dude don't you wait, dance with me more!  Chase and Marshall say no job too tight!  Dora shouts Vamonos, left then right!  [Chorus] [Verse 3 - wiggle bridge]  Spin around and wiggle your hands!  Keep on grooving, dance with me man!  SpongeBob's doing the jellyfish jive!  Simba roars, feel that rhythm come alive! ...

మనసులో నీవు మాటకలిపావు

Image
  మనసులో నీవు మాటకలిపావు చనువుతో నీవు తోడునిలిచావు ఎవరు నీవంటూ ఎదను నేనడిగా బదులు వద్దంటూ పదిల పరిచా చెలిమి తోడయిన చెలియా వలపు నీడవుచు నిన్నే నిన్నే చూసా వదిలి వీడనని మగువా తలపు తోడవుచు నిన్నే నిన్నే చూసా మనసులో నీవు మాటకలిపావు చనువుతో నీవు తోడునిలిచావు ఎవరు  నీవంటూ  ఎదను నేనడిగా బదులు వద్దంటూ పదిల పరిచా స్నేహమన్నది చెంత జేర్చిన చెలిమి నీవై ఊహకందని ఊసులన్నియూ కలిమి కావా దూరమున్నను మార్పులెన్నియో మరపు రాదే ప్రేమ తలపులో పిలుపులెన్నియో అది నాకు చాలే చెలీ మనసులో నీవు మాటకలిపావు చనువుతో నీవు తోడునిలిచావు ఎవరు  నీవంటూ  ఎదను నేనడిగా  బదులు వద్దంటూ పదిల పరిచా కనుపాపలోన మెరుపులెన్నంటూ పులకింత లేగా చిరుగాలి నీకు చెలికత్తెనంటూ ననుతాకి పోదా విలువైన కాలం పలకరించవే యని గుర్తు చేసి చూపే ఏనాటికైనా నీ ఉనికికోసం నే వేచిఉంటా అది నాకు చాలే చెలీ మనసులో నీవు మాటకలిపావు చనువుతో నీవు తోడునిలిచావు ఎవరు  నీవంటూ  ఎదను నేనడిగా  బదులు వద్దంటూ పదిల పరిచా In a world that often mistakes love for possession and friendship for convenience, this Telugu song arrives lik...

Dhruv 16th Birthday

Image
  Dhruv 16th Birthday Song Dhruv is my Hero I didn’t know much about me Until I see My hero in you (1) The day you were born. A new journey is In front of me, I reborn myself (2) I miss a lot To get true love Until you touch My heart to dive (3) So much you show In search of me Until you join My words to say (4) Day by day You are around me What a support   To strengthen me  (5) How many games We play together How much time We spend together (6) How fast you change Teenager in you How cute you are, hey dude To love the world (7) True brother   Bestie forever A role model to Purvi With fun and furious(8) Mom’s “Dil Ka Dadakan” To keep a smile on her Polimera’s family Backbone you are (9) Sixteen you are Can’t believe though A SuperHero… Dhruv is my hero (10)

పూర్వి పుట్టిన రోజు

Image
Love You Purvi Thalli - Sound Track మా మదిలోన పువ్వులా  తామర తీగ వన్నెలా  కోమల భావ పుత్రివై  ప్రేమలు పంచు చుందువే (1)   చిక్కిన పాలబుగ్గలన్  ఎక్కడ బోసి నవ్వులున్? టక్కరి నాటపాటలన్ ఎక్కడ గల్లు గజ్జలున్ (2)  అన్నకు నీవె అందెవై  వన్నెలు తెచ్చు బంధమై,  నాన్నకు నీవె తోడువై  మన్నిక జేరు లెన్నియో! (3) అమ్మకు తోడునీడగా  కమ్మని కౌగిలింతలో   చెమ్మని ప్రేమలెన్నియో నెమ్మిగ నింపుచుందువే (4)  ఆశల పూర్వి తల్లివై  వేషములన్ని వేయుచూ, బాసలలన్ని వెల్లువై ప్రాసలు పంచు ప్రాయమౌ (5) ఓ పరి చిట్టి గుమ్మవై  నీ పద సంపదెంతయో ఈ పరి పట్టుబొమ్మవై  ఆ పది వత్సరమ్ములే! (6)