పూర్వి పుట్టిన రోజు


Love You Purvi Thalli - Sound Track

మా మదిలోన పువ్వులా 

తామర తీగ వన్నెలా 

కోమల భావ పుత్రివై 

ప్రేమలు పంచు చుందువే (1)  


చిక్కిన పాలబుగ్గలన్ 

ఎక్కడ బోసి నవ్వులున్?

టక్కరి నాటపాటలన్

ఎక్కడ గల్లు గజ్జలున్ (2) 


అన్నకు నీవె అందెవై 

వన్నెలు తెచ్చు బంధమై, 

నాన్నకు నీవె తోడువై 

మన్నిక జేరు లెన్నియో! (3)


అమ్మకు తోడునీడగా 

కమ్మని కౌగిలింతలో  

చెమ్మని ప్రేమలెన్నియో

నెమ్మిగ నింపుచుందువే (4) 


ఆశల పూర్వి తల్లివై 

వేషములన్ని వేయుచూ,

బాసలలన్ని వెల్లువై

ప్రాసలు పంచు ప్రాయమౌ (5)


ఓ పరి చిట్టి గుమ్మవై 

నీ పద సంపదెంతయో

ఈ పరి పట్టుబొమ్మవై 

ఆ పది వత్సరమ్ములే! (6)


🎶



Comments

Popular posts from this blog

గౌరి పద్యము

భర్తృహరి నీతిశతకం – కేయూరాణి న భూషయన్తి

8వ ఉత్తర అమెరికా తెలుగు సంబరాలు - ఆంధ్ర (ప్రవాస) పౌరులై!