మనసులో నీవు మాటకలిపావు

 

మనసులో నీవు మాటకలిపావు
చనువుతో నీవు తోడునిలిచావు
ఎవరు నీవంటూ ఎదను నేనడిగా
బదులు వద్దంటూ పదిల పరిచా

చెలిమి తోడయిన చెలియా
వలపు నీడవుచు నిన్నే నిన్నే చూసా
వదిలి వీడనని మగువా
తలపు తోడవుచు నిన్నే నిన్నే చూసా

మనసులో నీవు మాటకలిపావు
చనువుతో నీవు తోడునిలిచావు
ఎవరు నీవంటూ ఎదను నేనడిగా
బదులు వద్దంటూ పదిల పరిచా

స్నేహమన్నది
చెంత జేర్చిన
చెలిమి నీవై

ఊహకందని
ఊసులన్నియూ
కలిమి కావా

దూరమున్నను
మార్పులెన్నియో
మరపు రాదే

ప్రేమ తలపులో
పిలుపులెన్నియో
అది నాకు చాలే చెలీ

మనసులో నీవు మాటకలిపావు
చనువుతో నీవు తోడునిలిచావు
ఎవరు నీవంటూ ఎదను నేనడిగా 
బదులు వద్దంటూ పదిల పరిచా

కనుపాపలోన
మెరుపులెన్నంటూ
పులకింత లేగా

చిరుగాలి నీకు
చెలికత్తెనంటూ
ననుతాకి పోదా

విలువైన కాలం
పలకరించవే యని
గుర్తు చేసి చూపే

ఏనాటికైనా నీ
ఉనికికోసం నే వేచిఉంటా
అది నాకు చాలే చెలీ

మనసులో నీవు మాటకలిపావు
చనువుతో నీవు తోడునిలిచావు
ఎవరు నీవంటూ ఎదను నేనడిగా 
బదులు వద్దంటూ పదిల పరిచా
🎶


In a world that often mistakes love for possession and friendship for convenience, this Telugu song arrives like a gentle breeze on a quiet evening — reminding us that the most beautiful love is the one that never demands, never declares, yet never disappears. This is not a story of chasing or losing. It is the story of a heart that found its home in someone's warmth — quietly, naturally, the way dawn finds the earth every morning without asking permission. The Narrator does not ask "Do you love me?" — instead, they simply say "Knowing you exist is enough for me." That one line carries an entire universe of emotion — a love so mature, so selfless, so full, that it needs no confirmation to survive. It lives in the sparkle of an eye, in the touch of a passing breeze, in a memory that distance cannot fade. This song is for every soul that has ever loved silently — the ones who kept someone safe in their heart without ever making it a burden for the other person. The ones who turned friendship into poetry without tearing it apart.

Comments

Popular posts from this blog

8వ ఉత్తర అమెరికా తెలుగు సంబరాలు - ఆంధ్ర (ప్రవాస) పౌరులై!

గౌరి పద్యము

భర్తృహరి నీతిశతకం – కేయూరాణి న భూషయన్తి