తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు -2025

కమాట చెప్పుటకు ర్పుతోడ నే

నొక పద్యమెందుకని చూచుచుండగా

క భాషగా తెలుగు ఇంపులెన్నియో  

కలమ్ము చూపెదని చాటుకొందునే (1)   


దికాద ఆంధ్రులకు అందమిచ్చుచూ

దిమంది గౌరవము పంచునెప్పుడూ,

దిదోచు మాటలను మంచికోరుచూ

దిలించునే తెలుగు గాథలెన్నియో (2)      


టుచూడు పామరులు పాడుచుండిరే

టుచూడు పండితులు విద్య జూపగా 

చిటుకేసి చాటువులు చెప్పుచుండిరే

కిటుకేమిరా? తెనుగు కీర్తి జూపగా (3)  


లవోకగా చిలుకు హాస్యమెంతయో

లికించిరే గిడుగు బాటవేయుచూ

లికించిరే తెలుగు బోధనమ్ములో

విలువైన సంపదని పేరు నిల్పెరా (4) 


మల్లేశ్వరరావు పొలిమేర 

ట్రోఫీ క్లబ్ , డల్లాస్ 

08.29.2025

  


కనకప్రభ పద్య లక్షణములు

  1. ఈ పద్య ఛందస్సుకే మంజుభాషిణి , జయా , నందినీ , ప్రబోధితా , మనోవతీ , విలంబితా , సునందినీ , సుమంగలీ అనే ఇతర నామములు కూడా కలవు.
  2. వృత్తం రకానికి చెందినది
  3. అతిజగతి ఛందమునకు చెందిన 2796 వ వృత్తము.
  4. 13 అక్షరములు ఉండును.
  5. 18 మాత్రలు ఉండును.
  6. మాత్రా శ్రేణిI I U - I U I - I I U - I U I - U
    • చతుర్మాత్రా శ్రేణి: I I U - I U I - I I U - I U I - U
    • పంచమాత్రా శ్రేణి: I I U I - U I I I - U I U - I U
    • మిశ్రగతి శ్రేణి (5-3) : I I U I - U I - I I U I - U I - U
    • మిశ్రగతి శ్రేణి (4-5) : I I U - I U I I - I U I - U I U
  7. 4 పాదములు ఉండును.
  8. ప్రాస నియమం కలదు
  9. ప్రతి పాదమునందు 9 వ అక్షరము యతి స్థానము
  10. ప్రతి పాదమునందు స , జ , స , జ , గ గణములుండును.

 

Comments

Popular posts from this blog

8వ ఉత్తర అమెరికా తెలుగు సంబరాలు - ఆంధ్ర (ప్రవాస) పౌరులై!

గౌరి పద్యము

భర్తృహరి నీతిశతకం – కేయూరాణి న భూషయన్తి