కోమల

 ప్రాణుల జీవిత బంధమ్ముల్లో 

వీణలు మీటిన విశ్వాసంలో

కానని కావ్యపు గ్రంథాలెన్నో

వాణిని చేర్చెద పద్యమ్ముల్లో  (1) 


మానవ జన్మపు మంత్రాలెన్నో 

దానవ జీవిత ధర్మాలెన్నో 

కానని ప్రేమల కార్యాలెన్నో

జ్ఞానము బొందిన సారథ్యంలో (2)


సామము జూపిన సాహిత్యంతో 

కోమల భావము కోరేవాడా  

నీమము నీవని నేర్పేవాడా

ఏమని చెప్పెద నీ వ్రాతల్లో (3)


ప్రొద్దున లేవగ రూపంలో తా

సద్దును జూడగ సంతోషంతో 

అద్దికమెంచిన ఆశాజ్యోతై

వద్దకు జేరితి వాత్సల్యమ్మున్ (4)


పచ్చని దారులు బాగోలేవా 

వెచ్చని కుచ్చిక వీలేలేదా

నచ్చిన సౌధము నాదేయంటూ  

ఎచ్చటి దానవి ఏ భాగ్యమ్మో (5)

  

కోమల

కోమల పద్య లక్షణములు

  1. వృత్తం రకానికి చెందినది
  2. పంక్తి ఛందమునకు చెందిన 55 వ వృత్తము.
  3. 10 అక్షరములు ఉండును.
  4. 16 మాత్రలు ఉండును.
  5. మాత్రా శ్రేణిU I I - U I I - U U U - U
    • చతుర్మాత్రా శ్రేణి: U I I - U I I - U U - U U
    • షణ్మాత్రా శ్రేణి: U I I U - I I U U - U U
    • మిశ్రగతి శ్రేణి (3-4) : U I - I U I - I U - U U - U
  6. 4 పాదములు ఉండును.
  7. ప్రాస నియమం కలదు
  8. ప్రతి పాదమునందు 7 వ అక్షరము యతి స్థానము
  9. ప్రతి పాదమునందు భ , భ , మ , గ గణములుండును.

Comments

Popular posts from this blog

8వ ఉత్తర అమెరికా తెలుగు సంబరాలు - ఆంధ్ర (ప్రవాస) పౌరులై!

గౌరి పద్యము

భర్తృహరి నీతిశతకం – కేయూరాణి న భూషయన్తి