ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

 ఎంత చెప్పిన తక్కువ ఎప్పుడైన

చెంత మక్కువ జూపుచు  చేరి వచ్చి 

సొంత వారని చూడక చూపులందు

అంత తానవును గురువు ఆది నుండి (1)


పేరు కోసము కాదని ప్రేమతోడ

మారు మాత్రము స్వార్ధపు మాట లేక  

ఊరు కోసము నీ దను సుద్ది నేర్పి

చేరు గమ్యపు బాటలో చెంత నుండి (2)


తారతమ్యములన్నవి తాకకుండ 

విద్యలన్నియు పంచుచు విశ్వమందు 

కాలమంతయు కార్యదీక్షణము నెంచి 

కోరుకుందురు వృద్ధిని కొంచె మైన (3) 



Comments

Popular posts from this blog

గౌరి పద్యము

భర్తృహరి నీతిశతకం – కేయూరాణి న భూషయన్తి

8వ ఉత్తర అమెరికా తెలుగు సంబరాలు - ఆంధ్ర (ప్రవాస) పౌరులై!