బేట్రాయి సామి దేవుడా - ఎడ్ల రామదాసు

 బేట్రాయి సామి దేవుడా – నన్నేలినోడ

బేట్రాయి సామి దేవుడా – నన్నేలినోడ

బేట్రాయి సామి దేవుడా (2) కాటేమి రాయుడా – కదిరినరసిమ్ముడా మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా సామి ||బేట్రాయి|| శాప కడుపు సేరి పుట్టగా – రాకాసిగాని వాని కోపామునేసి కొట్టగా ఓపినన్ని నీల్లలోన - వలసీ వేగామె తిరిగి ( వచ్చి నీవు వెదికి వెదికి ) బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ ||బేట్రాయి|| తాబేలై తాను పుట్టగా ఆ నీల్లకాడ దేవాసురులెల్లకూడగా (2) దోవసూసి కొండకింద దూరగానే సిల్కినపుడు సావులేని మందులెల్ల పావనంబైన వెన్న దేవర్లకిచ్చినోడ ||బేట్రాయి|| అందగాదనవుదులేవయా – గోపాల గో విందా రచ్చించా బేగరావయా పందిలోన సేరి కోర పంటితోనె ఎత్తి భూమి కిందు మిందు సేసినోద సందమామ నీవె కాద ||బేట్రాయి|| నారసిమ్మ నిన్నె నమ్మితి – నానాటికైన కోరితి నీ పాదమే గతీ ఓరి నీవు కంబాన సేరి ప్రహ్లాదు గాచి కోర మీసవైరిగాని గుండె దొర్లసేసినోడ ||బేట్రాయి|| బుడత బాపనయ్యవైతివి ఆ సక్కురవరితి నడిగి భూమి నేలుకుంటివే నిడువు కాల్లోడివై అడుగు నెత్తిపైన బెట్టి తడవు లేక లోకమెల్ల మెదిమతోటి తొక్కినోడ ||బేట్రాయి|| రెందుపదులు ఒక్కమారుతో ఆ దొరలనెల్ల సెండాడినావు పరసుతో సెందకోల బట్టి కోదందరామసామికాడ బెండు కోల సేసికొనే కొండకాడకేగినోడ ||బేట్రాయి|| రామదేవ రచ్చించరావయా సీతమ్మతల్లి శ్యామసుందర నిన్ను మెచ్చగా సామి తండ్రిమాట గాచి ప్రేమ భక్తినాదరించి ఆమైన లంకనెల్ల దోమగాను సేసినోడ ||బేట్రాయి|| దేవకీదేవి కొడుకుగా ఈ జగములోన దేవుడై నిలిచినావురా ఆవూల మేపుకొనీ ఆడోళ్ళాగుడుకొనీ తావుబాగ సేసుకొనీ తక్కిడి బిక్కిడి సేసినోడ ||బేట్రాయి|| ఏదాలు నమ్మరాదనీ ఆ శాస్త్రాలా వాదాలూ బాగలేవనీ బోధనలూ సేసికొనీ బుద్ధులూ సెప్పుకొనీ నాదావినోదుడైన నల్లనయ్య నీవెకాద ||బేట్రాయి|| కలికి నా దొరవు నీవెగా ఈ జగములోన పలికినావు బాలసిసువుడా చిల్లకట్టు పురములోన సిన్నీ గోపాలుడౌర పిల్లంగోవె సేతబట్టి పేట పేట తిరిగినోడ ||బేట్రాయి ||

Comments

Popular posts from this blog

8వ ఉత్తర అమెరికా తెలుగు సంబరాలు - ఆంధ్ర (ప్రవాస) పౌరులై!

గౌరి పద్యము

భర్తృహరి నీతిశతకం – కేయూరాణి న భూషయన్తి